భారతదేశం, సెప్టెంబర్ 23 -- కోల్‌కతా నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాలను భారీ వర్షాలు ముంచెత్తాయి. అనేక చోట్ల మోకాలి లోతు నీరు నిలవడంతో ప్రజల దైనందిన జీవితం అస్తవ్యస్తంగా మారింది. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. రాత్రంతా కురిసిన వర్షం మంగళవారం కూడా కొనసాగింది. వాతావరణ శాఖ మరోసారి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. పశ్చిమ్​ బెంగాల్​లో అత్యంత ఘనంగా జరుపుకునే దుర్గా పూజ వేళ భారీ వర్షాలు ఆటంకం కలిగిస్తుండటం ఆందోళనకు గురిచేస్తోంది.

ఈ భారీ వర్షాల కారణంగా కోల్​కతాలో విద్యుత్ షాక్‌కు గురై ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మెట్రో బ్లూ లైన్ సేవలకు కూడా అంతరాయం కలిగింది. ప్రతికూల వాతావరణం కారణంగా రెండు విమానయాన సంస్థలు ప్రయాణ హెచ్చరికలు జారీ చేశాయి.

ఈ భారీ వర్షాల వల్ల కోల్‌కతాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. ఇళ్లు, రెసిడెన్షియల్ ...