భారతదేశం, మార్చి 24 -- హైదరాబాద్ అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. అందుకు చాలా కారణాలు ఉన్నాయి. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు, పెట్టుబడులు, కంపెనీల స్థాపనల కారణంగా భాగ్యనగరం ప్రపంచపటంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఇక్కడి పాలకులు కూడా మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నాయి. ఫలితంగా మన భాగ్యనగరం భూములు బంగారం అయ్యాయి.

ప్రస్తుతం హైదరాబాద్ అంతర్జాతీయ నగరాలతో పోటీపడుతోంది. ఈ క్రమంలో శివారు ప్రాంతాల అభివృద్ధిపై ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఔటర్‌ రింగ్ రోడ్డును ఆనుకోని ఉన్న కోకాపేట, గచ్చిబౌలి, రాయదుర్గం, నానక్ రాంగూడ, నార్సింగి ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అక్కడ పరిస్థితులు చూస్తే.. మనం హైదరాబాద్‌లోనే ఉన్నామా.. లేక దేశం దాటి వచ్చామా అనే అనుభూతి కలగుతుంది.

వెస్టర్న్ హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు ఉపాధ...