భారతదేశం, మార్చి 9 -- ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రత్యేకంగా చెప్పుకొనే కొడవటంచ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు సమయం ఆసన్నమైంది. కొడవటంచ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. తెలంగాణలోని వివిధ జిల్లాలతో పాటు ఛత్తీస్‌గడ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. ఆదివారం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరగగా.. తెల్లవారుజాము నుంచే స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి, అర్చకులు బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు. సోమవారం స్వామివారి కల్యాణం, తలంబ్రాల కార్యక్రమంతో అసలు జాతర ప్రారంభం కానుంది.

ఉమ్మడి వరంగల్ జిల్లా పురాతన ఆలయాలకు పెట్టింది పేరు. వాటిలో కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఒకటి. ఈ ఊరి పేరు కొడవటంచగా విలసిల్లడానికి ఇక్కడ వెలిసిన స్వామివారే కారణమని పూర్వీకులు చెబుతున్నారు. స్వామివారి పుణ్యక్షేత్రం, ఊరి పేరు వెనక పూర్వీకులు, ఇక్కడి ...