భారతదేశం, జనవరి 30 -- Kodakanchi Brahmotsavam: తెలంగాణ కంచిగా ప్రసిద్ధి చెందిన కొడకంచి ఆలయంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా ఆదినారాయణుడు కొలువుదీరారు. కోరిన కోరికలు తీర్చే దేవునిగా విరాజిల్లుతున్నాడు. రాష్ట్ర రాజధానికి 30 కిలోమీటర్ల దూరంలో, పఠాన్ చెరువు, సంగారెడ్డి పట్టణాలకు అతి సమీపంలో జిన్నారం మండలంలోని కొడకంచి గ్రామంలో ఉన్న ఆదినారాయణ స్వామిని బ్రహ్మోత్సవాల సందర్భంగా దర్శించుకునేం దుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వస్తారు ఆలయ వర్గాలు చెబుతున్నాయి.

ఆదినారాయణ స్వామి ఆలయానికి సుమారు వెయ్యి సంవ త్సరాల పైగా చరిత్ర ఉంది. ఆలయ పునర్ని ర్మాణం తర్వాత దినదినాభివృద్ధి చెందుతున్న, ఈ ఆలయనికి భక్తుల రద్దీ పెరిగింది. ప్రకృతి వాతావరణంలో స్వయంభు గా వెలిసిన ఆదినారాయణ స్వామి ఆలయం లో బంగారు, వెండి బల్లులు ప్రత్యేకం. వీటిని తాకితే సర్వ దోషాలు తొలగిపో...