భారతదేశం, ఫిబ్రవరి 14 -- Kobali: తాను ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్ళు అయ్యింద‌ని, కొత్తగా ఏదో ఒకటి చేయాల‌నే ఆలోచ‌న‌తోనే కోబ‌లి చేశాన‌ని న‌టుడు ర‌వి ప్ర‌కాష్ అన్నాడు. అత‌డు ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన కోబ‌లి వెబ్‌సిరీస్ ఇటీవ‌ల డిస్నీ ప్ల‌స్ హాట్ స్టార్‌లో రిలీజైంది. ఈ యాక్ష‌న్ వెబ్‌సిరీస్‌కు రేవంత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. వెంక‌ట్‌, రాకీసింగ్‌, త‌రుణ్ రోహిత్‌, శ్రీతేజ్‌, శ్యామ‌ల ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు.

ఫిబ్రవరి 4న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ వెబ్‌సిరీస్ రిలీజైంది. 7 భాషల్లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ వెబ్‌సిరీస్ హాట్ స్టార్‌లో ట్రెండింగ్‌లో ఉంది. కోబ‌లి స‌క్సెస్ సెల‌బ్రేష‌న్స్ గురువారం హైద‌రాబాద్‌లో జ‌రిగాయి.

ఈ వేడుక‌లో యాక్ట‌ర్ ర‌వి ప్ర‌కాష్ మాట్లాడుతూ "కాఫీ షాప్‌లో కోబ‌లి కథ విన్నాను. నాకు నచ్చింది. అంతా కొత్తవాళ్లే. ఆడియెన్స్‌కు తెలిసిన మ...