Hyderabad, ఏప్రిల్ 11 -- KL Rahul Celebration: ఐపీఎల్ 2025లో కేఎల్ రాహుల్ టాప్ ఫామ్ లో ఉన్న సంగతి తెలుసు కదా. వరుసగా రెండో హాఫ్ సెంచరీతో ఢిల్లీని గెలిపించాడు. ఆర్సీబీపై కేవలం 53 బంతుల్లోనే 93 రన్స్ చేసి తన టీమ్ కు విజయం సాధించి పెట్టిన తర్వాత అతడు ఇది నా అడ్డా అనే స్టైల్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. తాను అలా ఎందుకు చేశానో ఇప్పుడు అతడు వెల్లడించాడు.

ఐపీఎల్ 2025లో భాగంగా ఆర్సీబీపై మ్యాచ్ గెలిచిన తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేయర్ కేెఎల్ రాహుల్ మాట్లాడాడు. విన్నింగ్ సిక్స్ కొట్టిన తర్వాత అతడు గ్రౌండ్ లో ఓ సర్కిల్ గీసి అందులో తన బ్యాట్ ను పాతాడు. ఆ తర్వాత ఇది నా అడ్డా అన్నట్లుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు చూపిస్తూ సైగ చేశాడు. ఆ సమయంలో రాహుల్ ఎప్పుడూ లేని విధంగా కాస్త అగ్రెసివ్ గా కనిపించాడు. అయితే తాను ఎందుకలా చేశానో అతడు చెప్పుకొచ్చాడు.

"ఇది నాకు చ...