Hyderabad, మార్చి 24 -- KL Rahul Athiya Shetty: క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ నటి అతియా శెట్టి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందారు. గతేడాది తాను ప్రెగ్నెంట్ అని చెప్పిన అతియా.. తాజాగా సోమవారం (మార్చి 24) పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వీళ్లు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి కూతురైన అతియా శెట్టి, టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ కు పాప పుట్టింది. బ్లెస్డ్ విత్ ఎ బేబీ గర్ల్ అంటూ ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. రెండు హంసలు ఉన్న ఓ పెయింటింగ్ ను పోస్ట్ చేస్తూ ఈ విషయం తెలిపారు.

సోమవారం (మార్చి 24) ఈ పాప జన్మించింది. వాళ్లకు ఇదే తొలి సంతానం. ఈ పోస్టుపై అభిమానులు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అతియా ప్రసవానికి సిద్ధంగా ఉండటంతో ఐపీఎల్లో ఢిల్లీ, ...