Hyderabad, మార్చి 18 -- ప్రతిరోజూ పిల్లల స్నాక్ బాక్స్ కు, లంచ్ బాక్స్ కు ఆరోగ్యకరమైన ఆహారాన్ని పంపాలి. అన్నం, సాంబార్ లేదా దోశ, ఇడ్లీ, పులిహోర వంటివి లంచ్ బాక్స్ కు పెడుతుంటారు. చాలా మంది స్నాక్స్ కోసం పండ్ల ముక్కలు పెడతారు. చాలా మంది ఆపిల్ ముక్కలు బాక్సుల్లో పెట్టి పిల్లలకు పంపిస్తారు. ఆపిల్ పండ్లను కట్ చేసి పిల్లల స్నాక్ బాక్స్ కు పంపితే కొద్ది నిమిషాల్లోనే అవి గోధుమ రంగులోకి మారతాయి. దీని వల్ల పిల్లలు తినడానికి ఇష్టపడరు. ఆపిల్ రుచి కూడా మారిపోతుంది. ఇలా రంగు మారకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

ఆపిల్ ను ముక్కలుగా కట్ చేసినప్పుడు, ఆక్సిజన్ దాని కణాలకు సోకుతుంది. ఎంజైములను ఉత్పత్తి చేసే రసాయన ప్రతిచర్యను ప్రేరేపిస్తుంది. ఇది పండును ఆక్సీకరణం చేస్తుంది. దీనివల్ల ఆపిల్ ముక్కలు గోధుమ రంగులోకి మారుతాయి.

ఆపిల్ ముక్కలు కట్ చేసిన తర్వాత ...