Hyderabad, ఫిబ్రవరి 20 -- వంటిల్లంటే చాలా రకాల సామాగ్రితో నిండి ఉంటుంది. మనం రోజూ ఉపయోగించే రకరకాల పదార్థాల కోసం ప్రతి రోజూ మార్కెట్ లేదా కిరాణా షాపుకు వెళ్లలేం. అంత సమయం కూడా ఉండదు. అందుకే ఒకేసారి సరుకులు, ఆహర పదార్థాలను తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటాం. అయితే కొన్ని సార్లు ఇవి త్వరగా పాడైపోతాయి. పురుగు పట్టడం, రుచి తగ్గపోవడం వంటివి జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు వాటిని ఉపయోగించలేక బయట పారేయాల్సి వస్తుంది. ఇలా చేయడం వల్ల చాలా డబ్బు వృథా అయినట్టే కదా.

మీ ఇంట్లో కూడా ఇలాగే జరుగుతుంటే మీరు ఇంట్లో తెచ్చి పెట్టుకున్న వంటింటి పదార్థాలు లేదా కిరణా సరుకులు త్వరగా పాడైపోతుంటే మీరు వాటిని నిల్వ చేయడంలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని అర్థమట. నిల్వ చేసేటప్పుడు చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యారంటే మీ వంట సామాన్లు ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయట. పాల నుంచి పప్పుల వరక...