Hyderabad, ఏప్రిల్ 2 -- Intimate Scene: ఓటీటీ వచ్చిన తర్వాత బోల్డ్ సీన్లు ఉన్న సినిమాలు, వెబ్ సిరీస్ ఎక్కువయ్యాయి. అయితే ఈ సీన్లలో నటించేందుకు నటీమణులు ఎంతలా ఇబ్బంది పడతారన్న వార్తలు తరచూ వస్తూనే ఉంటాయి. తాజాగా పాంచాలి, అసుర్ లాంటి వెబ్ సిరీస్ లలో నటించి పేరు తెచ్చుకున్న నటి అనుప్రియా గోయెంకా కూడా తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వెల్లడించింది.

సిద్ధార్థ్ కన్నన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనుప్రియ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. తనతో పలువురు కోస్టార్లు ఎంత దారుణంగా వ్యవహరించారో చెప్పుకొచ్చింది. "నాకు రెండుసార్లు ఇలా జరిగింది. తొలిసారి ఓ ముద్దు సీన్ సమయంలో.

అతడు దానిని అడ్వాంటేజ్ గా తీసుకున్నాడని నేను అనను. కానీ అతడు కాస్త ఉద్వేగానికి లోనయ్యాడు. అతనిలో ఉత్సాహం ఎక్కువైంది. నిజానికి అలా జరగకూడదు. ఎందుకంటే అక్కడ మనం కాస్త అవమానకరంగా, అసౌ...