భారతదేశం, ఫిబ్రవరి 16 -- Kishan Reddy : రాహుల్ గాంధీ డైరెక్షన్ లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. దేశంలో ఏ సీఎం వారానికోసారి దిల్లీకి వెళ్లిన చరిత్ర లేదని, అక్కడ రాహుల్ గాంధీ చెప్పినట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర ప్రభుత్వంపై అనాలోచిత విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

రాహుల్ గాంధీ కులం కోసం దేశవ్యాప్తంగా సర్వే చేయాల్సిన అవసరం లేదని, ఆయన కులం ఏంటో ప్రజలకు తెలుసునన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉదయం వరంగల్ నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ముందుగా హనుమకొండ హంటర్ రోడ్డులోని వేద బంక్వెట్ హాలులో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు.

రాష్ట్రంలో ఆరు గ్యారంటీల పేరున ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ ప...