భారతదేశం, ఫిబ్రవరి 7 -- హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్స్ సెంటర్ వేదికగా ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక "కిసాన్ అగ్రి షో 2025"ను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కిసాన్ ఫోరం ప్రైవేట్ లిమిటెడ్ కన్వీనర్ నిరంజన్ దేశ్‌పాండేతో కలిసి ప్రారంభించారు. వ్యవసాయ రంగ ప్రముఖులు, నిపుణులు, మార్గదర్శకులు, రైతులందరినీ ఒకే తాటిపైకి తీసుకురావడానికి.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 9న ముగుస్తుంది. ఈ ఈవెంట్‌ వ్యవసాయంలో అత్యాధునిక పురోగతిపై చర్చలు, సహకారం, పరిశోధనకు ప్రోత్సాహకరంగా పనిచేయనుంది.

కిసాన్ హైదరాబాద్ 2025.. వ్యవసాయ రంగంలోని విభిన్న ప్రదర్శనకారులకు వేదిక కానుంది. ఈ ప్రదర్శనలో వ్యవసాయ యంత్రాలు, ట్రాక్టర్లు , పనిముట్లు, నీరు - నీటిపారుదల పరిష్కారాలు, ప్లాస్టికల్చర్, వివిధ సాధనాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయంలో ఆవిష...