భారతదేశం, ఫిబ్రవరి 9 -- Kiran Royal : తిరుపతి జనసేన ఇన్ ఛార్జ్ కిరణ్ రాయల్ పై గత కొన్ని రోజులుగా పలు ఆరోపణలు వచ్చాయి. కిరణ్ రాయల్ పై వ్యక్తిగత ఆరోపణల నేపథ్యంలో జనసేన అధిష్టానం స్పందించింది. ఈ ఆరోపణలపై క్షుణ్ణమైన విచారణ జరిపి నిర్ణయం తీసుకునే వరకు కిరణ్ రాయల్ ను పార్టీ కార్యక్రమాల నుంచి దూరం ఉండాలని జనసేన పార్టీ ఆదేశించింది.

గత కొన్ని రోజులుగా కిరణ్ రాయల్ మీద మీడియాలో చోటు చేసుకున్న ఆరోపణలపై క్షుణ్ణమైన పరిశీలన చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పార్టీ కాన్ ప్లిక్ట్ కమిటీని ఆదేశించారు. అందువల్ల పార్టీ ఆదేశాలు వెలువడే వరకు జనసేన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించింది. ప్రజలకు ఉపయోగపడే విషయాలపై దృష్టి సారించాలని, సమాజానికి ప్రయోజనంలేని వ్యక్తిగతమైన విషయాలను పక్కకు పెట్టాలని జన సైనికులు, వీర మహిళలు, నాయకులకు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. చట...