భారతదేశం, ఫిబ్రవరి 17 -- యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, రుక్సర్ థిల్లాన్ జంటగా నటించిన దిల్‍రూబా చిత్రంపై మంచి బజ్ ఉంది. గతేడాది 'క' సినిమాతో కిరణ్ బ్లాక్‍బస్టర్ కొట్టారు. దిల్‍రూబా చిత్రంపై కూడా ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. ప్రమోషనల్ కంటెంట్ కూడా ఇప్పటికి వరకు ఆకట్టుకుంది. ఫిబ్రవరి 14న విడుదల కావాల్సిన ఈ చిత్రం మార్చి 14కు వాయిదా పడింది. అయితే, దిల్‍రూబా నుంచి 'హే జింగిలి' అంటూ రెండో పాట వచ్చేస్తోంది. ఈ పాటపైనే హీరోయిన్ రుక్సర్ ట్వీట్ చేయగా.. కిరణ్ అబ్బవరం రియాక్ట్ అయ్యారు.

దిల్‍రూబా నుంచి హే జింగిలి పాట నేటి (ఫిబ్రవరి 17) సాయంత్రం 5.01 గంటలకు రిలీజ్ కానుంది. దీనికోసం ఓ పోస్టర్ కూడా మూవీ టీమ్ తీసుకొచ్చింది. అయితే, హే జింగిలి ఏంటి అంటూ హీరోయిన్ రుక్సర్ థిల్లాన్ ట్వీట్ చేశారు. "ఓయ్ కిరణ్ అబ్బవరం.. ఇంకేం దొరకనట్టు.. బుజ్జి, బంగారం కాకుండ...