భారతదేశం, ఫిబ్రవరి 16 -- తెలుగు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం గతేడాది 'క' చిత్రంతో మంచి హిట్ కొట్టారు. వరుస ప్లాఫ్‍ల తర్వాత మళ్లీ సక్సెస్ ట్రాక్ పట్టారు. కిరణ్ హీరోగా నటించిన దిల్‍రూబా చిత్రం వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కావాల్సింది. ఈ రొమాంటిక్ డ్రామా మూవీకి విశ్వ కరణ్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే, ఈ మంచి క్రేజ్ ఉన్న చిత్రం సడెన్‍గా వాయిదా పడింది.

దిల్‍రూబా మూవీ వాలెంటైన్స్ డేకు సూటయ్యేలా లవ్ స్టోరీతో రూపొందింది. ఈ చిత్రంపై ముందు నుంచి పాజిటివ్ వైబ్స్ నెలకొన్నాయి. ఈ వాలెంటైన్స్ డేకు తెలుగులో లైలా, బ్రహ్మా ఆనందం చిత్రాలు రిలీజయ్యాయి. లైలాకు డిజాస్టర్ టాక్ రాగా.. బ్రహ్మా ఆనందం మూవీకి మోస్తరు రెస్పాన్స్ ఉంది. అయితే, ఈ రెండు సినిమాలు కూడా వాలెంటైన్స్ సీజన్‍కు కనెక్ట్ అయ్యేవి కాదు.

రొమాంటిక్ డ్రామా రూపొందిన దిల్‍రూబా చిత్ర...