Hyderabad, ఫిబ్రవరి 19 -- Kiran Abbavaram About Dilruba Movie Release: యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన కొత్త సినిమా "దిల్ రూబా". ఈ సినిమాలో రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా మంగళవారం (ఫిబ్రవరి 18) హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో దిల్ రూబా మూవీ సెకండ్ సింగిల్ సాంగ్ 'హే జింగిలి..' పాటను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరో కిరణ్ అబ్బవరం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. "దిల్ రూబా మూవీ చేసినందుకు చాలా గర్వంగా హ్యాపీగా ఫీలవుతున్నాను. ఇంటెన్స్ మ్యూజికల్ లవ్ స్టోరీగా దిల్ రూబా మీ అందరినీ ఆకట్టుకుంటుంది. సారెగమా వాళ్లు ఫస్ట్ టైమ్ ఈ మూవీతో టాలీవుడ్‌లోకి వస్తున్నారు. ప్రొడ్యూసర్ రవి గారు, డైరెక్టర్ విశ్వ కరుణ్ మూడేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం కష్టపడ్డారు. వాళ్ల కోసమైన...