Hyderabad, ఫిబ్రవరి 28 -- GV Prakash Kumar Kingston Telugu Trailer Released: అటు మ్యూజికి డైరెక్టర్‌గా ఇటు హీరోగా సత్తా చాటుతున్నాడు జీవీ ప్రకాష్ కుమార్. బ్యాచ్‌లర్ వంటి రొమాంటిక్ సినిమాతో అలరించిన జీవీ ప్రకాష్ కుమార్ ఇప్పుడు హారర్ సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా కింగ్స్‌స్టన్. భారతీయ తొలి సీ అడ్వెంచర్ ఫాంటసీ సినిమాగా కింగ్‌స్టన్ తెరకెక్కింది. ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్, జి స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా రూపొందించాయి. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ కుమార్ స్వయంగా నిర్మించడం విశేషం. కింగ్‌స్టన్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు గంగ ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి తీసుకొస్తున్నారు.

తెలుగు, తమిళ భాషల్లో మార్చి 7న కింగ్‌స్టన్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నే...