Hyderabad, మార్చి 4 -- GV Prakash Kumar About Kingston Movie And Franchise: తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన జీవి ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన తాజా సినిమా 'కింగ్‌స్టన్'. జి స్టూడియోస్ సంస్థతో కలిసి ప్యారలల్ యూనివర్స్ పిక్చర్స్ పతాకం మీద జీవీ ప్రకాష్ కుమార్ ప్రొడ్యూస్ చేశారు. నిర్మాతగా జీవీ ప్రకాష్ కుమార్ తొలి చిత్రమిది.

గంగా ఎంటర్టైన్మెంట్స్ అధినేత మహేశ్వర్ రెడ్డి కింగ్‌స్టన్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ శుక్రవారం మార్చి 7వ తేదీన కింగ్‌స్టన్ విడుదల కానుంది. ఈ సందర్భంగా జీవీ ప్రకాష్ కుమార్ హైదరాబాద్ వచ్చారు. తెలుగు మీడియాతో ఆయన ముచ్చటించారు. ఈ ఇంటర్వ్యూలో అనేక ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు జీవీ ప్రకాష్ కుమార్.

థాంక్యూ అండి.‌ కింగ్‌స్టన్ ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ రావడం నాకు సంతో...