Hyderabad, మార్చి 7 -- పిల్లలతో ఇంటి పనులు చేయించడానికి చాలా మంది తటపటాయిస్తుంటారు. చాలా వరకూ గారాభంతోనో, వారు సరిగా చేయలేరనే ఉద్దేశ్యంతోనో ఇంటి పనులకు దూరంగా ఉంచుతారు. కానీ, ఇలా చేయడం మంచి పద్ధతి కాదని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. కొందరి పిల్లల్లో స్వతాహాగా ఇంటి పనులు చేయాలనే ఉత్సాహం కనిపిస్తుందట. అలాంటి చిన్నారులను వారించి ఆ ఆలోచనను విరమించుకునేలా చేయడం వారి భవిష్యత్తును కష్టతరంగా మారుస్తుందట. పనులు చేయిస్తేనే పిల్లల భవిష్యత్తుకు మంచిదట. ఎలాగో తెలుసుకుందాం రండి..

పిల్లల వయసుకు తగినట్లుగా కొన్ని బాధ్యతలు, పనులు అప్పగించడం ద్వారా వారు కొన్ని సామాజిక నైపుణ్యాలను నేర్చుకుంటారు. ఇలా చేయడం వలన వారు మరింత బాధ్యతాయుతంగా, ఆత్మవిశ్వాసంతో పెరుగుతారట.అంతేకాకుండా, కుటుంబంతో వారి బంధం బలపడుతుందట. పిల్లల మంచి అభివృద్ధికి వారి రోజువారీ కార్యక్రమం...