Hyderabad, ఫిబ్రవరి 19 -- పిల్లలను క్రమశిక్షణగా పెంచడం కత్తి మీద సామే. ఈ తరం పిల్లలు హైపర్ యాక్టివ్‌గా ఉంటారు. పిల్లలు తమ తల్లిదండ్రులను చూసే చాలా విషయాలు త్వరగా గ్రహిస్తారు. జీవితం గురించి వారి అభిప్రాయాలు కూడా వారి తల్లిదండ్రుల ప్రవర్తనను బట్టే మారిపోతుంది. అందుకే, తల్లిదండ్రులు ప్రతి చిన్న విషయాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. తల్లిదండ్రులు పిల్లలతో ఎంతవరకు ఓపెన్ గా మాట్లాడాలి? ఎంతవరకు నిజాయితీగా అన్ని విషయాలు చెప్పాలి? వంటివి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని విషయాలు తల్లిదండ్రులు తమ పిల్లలతో ఎప్పటికీ పంచుకోకూడదు. ఇది వారి మానసిక ఆరోగ్యంపై మాత్రమే కాకుండా, మొత్తం వ్యక్తిత్వంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది.

ప్రతి ఇంట్లో అప్పుడప్పుడు భార్యాభర్తలు గొడవపడడం సహజం. అయితే, మీ గొడవలో పిల్లలను మాత్రం కలపకండి. పిల్లల ముందు ఒకరినొకరు ...