Hyderabad, ఫిబ్రవరి 1 -- పిల్లలకు ఆహారం తినిపించడం ఈ రోజుల్లో పెద్ద సవాళు. వారి చిన్న బొజ్జలను నింపేందుకు తల్లులు వివిధ రకాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. ముఖ్యంగా పాఠశాలకు వెళ్ళే పిల్లలకు పోషకమైన ఆహారం చాలా అవసరం. లేకపోతే వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుంది. అటువంటి సందర్భంలో తల్లిదండ్రులు ఆహారం విషయంలో జాగ్రత్త వహించాలి. పిల్లల లంచ్ బాక్స్‌లో పెట్టడానికి అనేక రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. కానీ వాటి ఎంపికలో జాగ్రత్త వహించాలి. లేకపోతే పిల్లలకు జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి. పిల్లలకు ఏ ఆహార పదార్థాలు ఇవ్వకూడదు, ఏ రకమైన ఆహారం సరైనది అనే వివరాలు ఇక్కడ ఉన్నాయి తెలుసుకోండి.

పిల్లలు ఇష్టంగా తింటారనో, త్వరగా అయిపోతుందనో పిల్లల లంచ్ బాక్స్‌లో ఎప్పటికీ ఇన్‌స్టంట్ నూడుల్స్ పెట్టకండి. పిల్లలు నూడుల్స్ అడుగుతారు, కానీ ఉదయం తయారు చేసిన నూడుల్...