Hyderabad, ఏప్రిల్ 10 -- ఫోన్లు జీవితంలో భాగంగా మారిపోయాయి. పిల్లలు కూడా ఫోన్లో, గేమ్స్ ఆడడం, యూట్యూబ్ వీడియోలు చూడడం అలవాటుగా మార్చుకున్నారు. ఫోన్ అధికంగా చూసే పిల్లల్లో మయోపియా అనే వ్యాధి వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇది వారి కళ్ళపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. పిల్లలు యువతలో మయోపియా సమస్య చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి.

స్క్రీన్ టైం అధికంగా అవ్వడం వల్ల మయోపియా కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు వైద్యులు వివరిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభాలో దాదాపు సగం మంది ఈ మయోపియా బారిన పడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ మయోపియా వ్యాధి బారిన పడినవారు తగిన సమయంలో సరైన చికిత్స తీసుకోపోతే శాశ్వతంగా దృష్టి కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి.

మయోపియా అనేది ఒక కంటి సమస్య. స్మార్ట్ ఫోన...