Hyderabad, జనవరి 30 -- మనదేశంలో టీ, కాఫీలకు క్రేజ్ ఎక్కువ. ప్రతిరోజూ వీటిని తాగడంతోనే రోజును ప్రారంభిస్తారు. మన దేశ జనాభాలో సగానికి పైగా తమ రోజును ఒక కప్పు వేడి టీతో ప్రారంభిస్తారు. క్రమేపీ ఈ రోజుల్లో కాఫీ కూడా జనాలకు బాగా నచ్చేస్తోంది. ముఖ్యంగా నగరాల్లో నివసిస్తున్న యువత కాఫీ తాగేందుకు ఇష్టత చూపిస్తున్నారు. పెద్దలు కాఫీ లేదా టీ తాగడం పూర్తిగా సాధారణం. కానీ తమతో పాటూ తల్లిదండ్రులు ఇంట్లో ఉండే చిన్న పిల్లలకు టీ లేదా కాఫీ ఇస్తారు. ఇది ఏ మాత్రం మంచిది కాదు. అది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.

వైద్యులు కూడా టీ, కాఫీలు పిల్లలకు ఇవ్వవద్దని సలహా ఇస్తుంటారు. అయినా కూడా తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచే టీ, కాఫీలు ఇచ్చేస్తూ ఉంటారు. దీనివల్ల వారి ఆరోగ్యాన్ని స్వయంగా మీరే చెడగొడుతున్నట్టు లెక్క. కాబట్టి పిల్లలకు ఏ వయసు నుంచి టీ, ...