Hyderabad, జనవరి 31 -- సాధారణంగా మొటిమలు, మచ్చలు వంటి చర్మ సమస్యలు టీనేజ్ నుంచి అంటే 14 నుంచి 16 ఏళ్ల వయసు దాటినప్పటి నుంచీ ప్రారంభమవుతాయి. దీన్ని కౌమారదశ అని పిలుస్తారు. కౌమారదశలో చాలా మంది అబ్బాయిలు, అమ్మాయిలు మొటిమలతో బాధపడుతుంటారు. కానీ ఇప్పుడు 8 ఏళ్ల చిన్న వయసులోనే అబ్బాయిలు, అమ్మాయిలు మొటిమలు, ముఖంపై మచ్చల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. మీ పిల్లలు కూడా ఎనిమిది నుంచి పద్నానులేళ్ల లోపు వారే అయి ఉండి ఇటువంటి చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

మీ ఇంట్లో 8-14 ఏళ్ల పిల్లలకు మొటిమలు లేదా చుండ్రు సమస్య ఉంటే వారి డైట్లో నుంచి వెంటనే తొలగించాల్సిన కొన్ని ఆహార పదార్థాలున్నాయని ప్రముఖ డైటీషియన్ మనప్రీత్ ఇన్స్టాగ్రామ్‌లో సలహా ఇచ్చారు.

పిల్లలకు చాక్లెట్లు ఇవ్వడం పూర్తిగా ఆపండి. ఇందులో ఉన్న అధిక ...