Hyderabad, ఫిబ్రవరి 27 -- శరీరంలో పేరుకుపోయిన విషాలు, వ్యర్ధాలను, మురికిని శుభ్రం చేసే పని కిడ్నీలదే. అందుకే మన శరీరంలోని అత్యవసర భాగాల్లో కిడ్నీలు ముఖ్యమైనవి. రక్తంలోని మలినాలను కూడా వడపోసి శరీరం నుంచి బయటికి పంపుతాయి. కిడ్నీలు ఇవి సరిగా పనిచేయకపోతే శరీరంలో టాక్సిన్స్ పేరుకు పోతాయి. దీని వల్ల శరీరంలోని ఇతర భాగాలు కూడా దెబ్బతింటాయి. కాబట్టి కిడ్నీలు సమర్థంగా పనిచేయాల్సిన అవసరం ఉంది.

కిడ్నీలు ఎప్పుడైతే చెడిపోవడం ప్రారంభమవుతాయో ఆ లక్షణాలు కొన్ని శరీరం మీకు తెలియజేస్తుంది. ఉదయం లేచిన వెంటనే కొన్ని రకాల లక్షణాలు కనిపిస్తే మీరు కిడ్నీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉంది.

ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ పాదాలలో వాపు కనిపిస్తే దానిని అశ్రద్ధ చేయకండి. ఎలాంటి ఇన్ఫెక్షన్ లేకుండా కాళ్లలో వాపు ఉంటే అది మూత్రపిండాల వల్లేనని అర్థం చేసుకోవచ్చు. శ...