Hyderabad, ఫిబ్రవరి 16 -- ప్రేమికుల పండగ అయిన వాలైంటైన్ వీక్ ముగిసిపోయింది. ప్రేమలో మోసపోయిన, ప్రేమ వారాన్ని చూసి విసిగిపోయిన ప్రేమ వ్యతిరేకుల పండగ వచ్చేసింది. యాంటీ వాలైంటైన్ వీక్ పేరుతో జరుపుకునే ఈ లవ్ ఫెయిల్యూర్స్ ఫెస్టివల్‌లో మొదటి రోజైన స్లాప్ డే ఫిబ్రవరి 15న ముగిసిపోయింది. రెండవ రోజైన ఫిబ్రవరి 16ను కిక్ డేగా జరుపుకుంటారు. కిక్ డే అంటే తన్నడమే కదా.. వెళ్లి నా ఎక్స్ ను తన్నేస్తా! అని రెడి అయిపోకండి. కిక్ డే ఉద్దేశం అది కాదు. ఈ రోజున ఎవరిని తన్నాలి, ఎలా జరుపుకోవాలి వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

యాంటీ వాలెంటైన్ వీక్ అంటే ప్రేమలో విఫలమైన వారు, ప్రేమ కారణంగా బాధలను, భారాన్ని అనుభవిస్తున్న వారు వాటి నుంచి బయటపడేందుకు జరుపుకునే పండుగ. గతం తాలూకా బాధలను, కోపాన్ని, ద్వేషాన్ని బయటికి పంపించేసి ప్రశాంతంగా, స్వేఛ్ఛగా కొత్త జీవితాన్ని మొదల...