Hyderabad, ఫిబ్రవరి 28 -- Kiara Advani Pregnant: కియారా అద్వానీ తల్లి కాబోతోంది. తన భర్త, బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి తొలి సంతానాన్ని త్వరలోనే పొందబోతున్నట్లు వెల్లడించింది. శుక్రవారం (ఫిబ్రవరి 28) ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. వీళ్లు ఓ క్యూట్ ఫొటోను షేర్ చేశారు.

ఈ మధ్యే రామ్ చరణ్ తో కలిసి గేమ్ ఛేంజర్ మూవీలో నటించిన కియారా అద్వానీ తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని శుక్రవారం వెల్లడించింది. "మా జీవితాల్లో అతి పెద్ద బహుమతి. త్వరలోనే రాబోతోంది" అనే క్యాప్షన్ తో ఆమె పోస్ట్ చేసింది. దీనికి ఆమె యాడ్ చేసిన ఫొటో క్యూట్ గా ఉంది. ఇద్దరి చేతుల్లో చిట్టి పొట్టి సాక్స్ చూడొచ్చు.

కియారా చేసిన ఈ పోస్ట్ వెంటనే వైరల్ అయింది. నటి హుమా ఖురేషీ, నేహా ధూపియాలాంటి వాళ్లు కంగ్రాట్స్ చెప్పారు. త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారన్...