Hyderabad, మే 18 -- Kiara Advani Cannes 2024: రామ్ చరణ్ (Ram Charan) స్పెషల్ మూవీ గేమ్ చేంజర్ (Game Changer Movie) హీరోయిన్ కియారా అద్వానీ తన తొలిసారిగా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఎంట్రీ ఇచ్చింది. 2024లో జరుగుతున్న 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌ కియారా అద్వానీ డెబ్యూ ఎంట్రీగా నిలిచింది. ఈ విషయంతో కియరా అద్వానీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు.

లోరియల్ ప్యారిస్ బ్రాండ్ అంబాసిడర్‌లలో ఒకరైన కియారా అద్వానీ కేన్స్‌లో వానిటీ ఫెయిర్ హోస్ట్ చేస్తున్న రెడ్ సీ ఫిల్మ్ ఫౌండేషన్ ఉమెన్ ఇన్ సినిమా గాలా డిన్నర్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. కియారా తన ఇన్‌స్టాగ్రామ్‌లో కేన్స్‌లో గడిపిన గ్లింప్స్‌తో కూడిన రీల్‌ను షేర్ చేసింది.

ఈ రీల్‌లో, కియారా అద్వానీ ప్రబల్ గురుంగ్ డిజైన్ చేసిన హై-స్లిట్ గౌనులో గాలా వద్దకు వచ్చింది. కబీర్ సింగ్ బ్యూటి కియారా అద్...