భారతదేశం, మార్చి 3 -- మార్కెట్లో కియా కార్లకు మంచి క్రేజ్ ఉంది. దీనితో కంపెనీ కొత్త కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకు వచ్చేందుకు ప్రణాళికలు చేస్తుంది. సెల్టోస్, సోనెట్ వంటి మోడళ్లు భారతీయ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. తన అమ్మకాలను మరింత పెంచుకోవడానికి కంపెనీ వచ్చే 2 ఏళ్లలో భారతీయ మార్కెట్లో అనేక కొత్త మోడళ్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే రోజుల్లో ప్రారంభించబోయే కంపెనీ 3 కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

కియా ఫేస్‌లిఫ్ట్ చేసిన కేరెన్స్‌తో పాటు దాని ఎలక్ట్రిక్ వెర్షన్‌పై కూడా పని చేస్తోంది. కేరెన్స్ ఈవీని ఇప్పటికే టెస్టింగ్ సమయంలో చూశారు. గాడివాడి వెబ్‌సైట్‌లో ప్రచురించిన ఒక వార్త ప్రకారం, కేరెన్స్ ఈవీ అమ్మకాలు 2025 చివరిలో లేదా 2026 ప్రారంభంలో రావొచ్చు. కేరెన్స్ ఈవీ ఒకసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లకు పైగా రేంజ్‌తో వస్తుం...