భారతదేశం, ఫిబ్రవరి 2 -- మీరు పవర్‌ఫుల్ ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే కియా రెండు ఉత్తమ కార్లు, సిరోస్, సోనెట్ లిస్టులో ఉన్నాయి. కియా ఇటీవల సిరోస్ ధరలను ప్రకటించింది. అయితే సోనెట్‌ కారుతో పోల్చితే ఇందులో బెస్ట్ అవుతుందో కొందరికి కన్ఫ్యూజన్ ఉంటుంది. రెండు ఎస్‌యూవీలకు మంచి పేరు ఉంది. అయితే వీటిలో ఏది మీకు సరైనది? ధర, ఫీచర్లు, ఇంజన్ ఆప్షన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం..

కియా సిరోస్ ప్రారంభ ధర రూ .9 లక్షలు, సోనెట్ ప్రారంభ ధర రూ .9.15 లక్షలు. సిరోస్ 1.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో మాత్రమే వస్తుంది. సోనెట్ 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ ఇంజన్, టర్బో పెట్రోల్ ఆప్షన్స్‌తో వస్తుంది. సిరోస్ హెచ్‌టీఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ .16 లక్షల వరకు ఉంటుంది. మరోవైపు సోనెట్ జీటిఎక్స్ ప్లస్ డ్యూయల్-టోన్ (అదే ఇంజన్, గేర్ బాక్స్‌తో) లో రూ .14.85 లక్...