భారతదేశం, మార్చి 18 -- Kia price hike: కియా ఇండియా తన లైనప్ లోని కార్లపై 3 శాతం ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరల పెరుగుదల దాని పూర్తి మోడల్ లైనప్ అంతటా వర్తిస్తుందని స్పష్టం చేసింది. ఈ ధరల పెంపు ఏప్రిల్ 1, 2025 నుండి అమల్లోకి వస్తుందని వెల్లడించింది. ముడి సరుకుల ధరలు పెరగడం, సప్లై చైన్ వ్యయాలు పెరగడమే ఈ నిర్ణయానికి కారణమని కొరియా కార్ల తయారీ సంస్థ కియా పేర్కొంది.

ప్రస్తుతం కియా ఇండియాలో సోనెట్, కార్నివాల్, కారెన్స్, ఈవీ9, సెల్టోస్, సైరోస్, ఈవీ6 వంటి మోడళ్లను అందిస్తోంది. వీటిలో ఒక్కో మోడల్ పై ఎంత ధరను పెంచనున్నారనే విషయాన్నిధరల పెరుగుదలను అమలు తేదీకి కొన్ని రోజుల ముందు ప్రకటిస్తారు. అందువల్ల, కియా కార్ ను కొనే ప్లాన్ లో ఉన్న కొనుగోలుదారులు ధరల పెరుగుదల భారాన్ని తగ్గించుకోవాలనుకుంటే, ఏప్రిల్ 1 కంటే ముందు తమ వాహనాలను బుక్ చేసుకోవడం...