భారతదేశం, ఫిబ్రవరి 3 -- కియా కార్లను భారతీయ కస్టమర్లు ఎక్కువగానే ఇష్టపడుతున్నారు. కియాకు చెందిన కొన్ని కార్లను జనవరిలో కొనేందుకు కస్టమర్లు ఆసక్తి చూపించారు. అయితే ఈ సమయంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ కియా ఈవీ6కు ఒక్క కొనుగోలుదారు కూడా దొరకలేదు. కియా ఈవీ6 5 సీట్ల ఎలక్ట్రిక్ కారు. కియా ఈవీ6 ఫీచర్లు, పవర్ట్రెయిన్, ధర గురించి చూద్దాం..

ఫీచర్ల విషయానికొస్తే ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలో వినియోగదారులు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతారు. 14 స్పీకర్ల మెరిడియన్ సౌండ్ సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్, పవర్డ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇండియన్ మార్కెట్లో ఈవీ ధర రూ .60.97 లక్షలు(ఎక్స్ షోరూమ్) నుండి రూ .65.97 లక్షల(ఎ...