భారతదేశం, మార్చి 7 -- Kia Carens sales: కియా కారెన్స్ ను లాంచ్ చేసిన 36 నెలల్లోనే 2 లక్షల యూనిట్లకు పైగా విక్రయించినట్లు కియా ఇండియా ప్రకటించింది. ఇందులో కియా కారెన్స్ టాప్ ఎండ్ వేరియంట్ అమ్మకాలు 24 శాతంగా ఉన్నాయని తెలిపింది. అలాగే, పవర్ట్రెయిన్ ప్రాధాన్యతల పరంగా, పెట్రోల్ వేరియంట్ 58 శాతం అమ్మకాలతో అగ్రస్థానంలో ఉండగా, డీజిల్ వేరియంట్ అమ్మకాలు 42 శాతం ఉన్నాయి. 32 శాతం మంది కస్టమర్లు ఆటోమేటిక్, ఐఎమ్టీ వేరియంట్ ను ఎంచుకున్నారు. 28 శాతం మంది కొనుగోలుదారులు సన్ రూఫ్ ఉన్న వేరియంట్లను ఎంచుకున్నారు. మొత్తం అమ్మకాలలో 95 శాతం 7-సీటర్ మోడళ్ల నుండి వచ్చాయి. ఈ రికార్డు సేల్స్ తో కియా కారెన్స్ నిజమైన ఫ్యామిలీ కారుగా నిలిచింది.

కియా కారెన్స్ మూడు ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. అవి టర్బో పెట్రోల్ ఇంజన్, నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, డీజిల్ ఇంజన్ ఉన్...