భారతదేశం, మార్చి 23 -- కియా క్యారెన్స్​కి ఈవీ టచ్​ ఇచ్చేందుకు దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఏర్పాట్లు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ మోడల్​ ఇప్పుడు దక్షిణ కొరియాలో దర్శనమిచ్చింది. ఆల్-ఎలక్ట్రిక్ ఎంపీవీ భారీ క్యామోఫ్లాజ్​లో కెమెరాలకు చిక్కింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్ట్రిక్​ వెహికిల్​పై మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. వాటి గురించి ఇక్కడ తెలుసుకోండి..

భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. ఇప్పటికే పలు ఆటోమొబైల్ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లోకి విడుదల చేశాయి. కియా కూడా ఈవీ6, ఈవీ9 వంటి మోడళ్లతో ఈ జాబితాలో చేరింది. అయితే ఈ రెండూ ప్రీమియం సెగ్మెంట్​లో ఉన్నాయి. ఇప్పుడు, హ్యుందాయ్ గ్రూప్ ఆధ్వర్యంలోని దక్షిణ కొరియా ఆటో దిగ్గజం మాస్-మార్కెట్ విభాగంలోని అవకాశాలను అందిపుచ్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇం...