భారతదేశం, ఏప్రిల్ 6 -- గ్రౌండ్ లో పర్ఫార్మెన్స్ చూపలేకపోయిన పాకిస్థాన్ టీమ్.. ఫ్యాన్స్ పై మాత్రం ఆగ్రహం చూపించింది. రన్స్ కొట్టలేకపోయిన ఆ టీమ్.. ఫ్యాన్స్ ను కొట్టడానికి మాత్రం రెడీ అయిపోయింది. శనివారం (ఏప్రిల్ 5) మౌంట్ మౌంగనుయిలోని బే ఓవల్ మైదానంలో పాకిస్థాన్ క్రికెటర్లు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. అభిమానులపై దాడికి ప్రయత్నించారు. సెక్యూరిటీ సిబ్బంది క్రికెటర్లను లాగి పడేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ముఖ్యంగా ఆల్ రౌండర్ ఖుష్దీల్ షా ఊగిపోయాడు.

న్యూజిలాండ్ పర్యటనలో పాకిస్థాన్ టీమ్ దారుణ ప్రదర్శన చేసింది. టీ20 సిరీస్ ను 1-4తో కోల్పోయిన ఆ టీమ్.. వన్డే సిరీస్ లో 0-3తో వైట్ వాష్ కు గురయ్యారు. ఈ సిరీస్ సాంతం పాక్ క్రికెటర్ల పర్ఫార్మెన్స్ పై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఆ ఆటగాళ్లను ఫ్యాన్స్ ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు. ఆ టీమ్ ప్ర...