Hyderabad, మార్చి 12 -- స్వీట్లు తయారుచేయడానికి కోవా అవసరం. ముఖ్యంగా కజ్జి కాయలు, కోవా బిళ్లలు వంటివి తయారుచేసేందుకు ఈ కోవా కావాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లో హోలీ రోజు గుజియా కచ్చితంగా తయారుచేస్తారు. అందులోకి కోవా ఉండాలి. మార్కెట్లో దొరికే కోవా కల్తీది కావచ్చు. అలాగే పాలతోనే కోవాను తయారుచేయాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఇన్ స్టెంట్‌గా పాలు లేకుండా కోవాను చేయవచ్చు. ఇక్కడ మేము రెసిపీ ఇచ్చాము. పాలు లేకుండా ఖోవా తయారు చేయడానికి చిన్న చిట్కాలు ఉన్నాయి దీని సహాయంతో టేస్టీ ప్యూర్ ఖోవా కొన్ని నిమిషాల్లో రెడీ అవుతుంది.

పాలతో కోవా తయారు చేయడానికి చాలా సమయం పడుతుంది. అంత సమయం లేనప్పుడు పాలపొడి సాయంతో కూడా కోవాను అప్పటికప్పుడు తయారు చేసేయచ్చు. కోవా తయారీకి మూడు వస్తువులు అవసరం అవుతాయి. ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేయాలి. ఆ నెయ్యి మార్కెట్లో దొరికే...