భారతదేశం, ఫిబ్రవరి 22 -- ఐదారు నెలల కిందట.. తెలంగాణ మద్యంకు బాగా డిమాండ్ ఉండేది. ముఖ్యంగా ఏపీ సరిహద్దు జిల్లాల్లో అమ్మకాలు విపరీతంగా ఉండేవి. అందుకు కారణం ఏపీలో మద్యం ధరలు ఎక్కువ కావడమే. దీంతో చాలామంది వ్యాపారులు సరిహద్దు ప్రాంతాల్లో వైన్ షాపులు దక్కించుకోవడానికి ఆసక్తి చూపేవారు. కానీ ప్రస్తుతం సీన్ రివర్స్ అయ్యింది. ఏపీ సరిహద్దులోని తెలంగాణ జిల్లాల్లో మద్యం అమ్మకాలు బాగా పడిపోయాయి.

ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లిక్కర్​ సేల్స్ బాగా పడిపోతున్నాయి. గతేడాదితో పోలిస్తే.. సేల్స్ డౌన్ అయ్యాయి. ముఖ్యంగా మూడు నెలలుగా ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేవు. ఈనెల కూడా టార్గెట్‌ను అందుకోవడం కష్టమే అని అధికారులు, వ్యాపారులు చెతున్నారు. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే.. రూ.10 కోట్ల మేరకు అమ్మకాలు తగ్గాయని తెలుస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రేట్లు తగ్గడంతో ఆ ప్...