భారతదేశం, ఏప్రిల్ 14 -- వివాహేతర సంబంధం కారణంగా భర్తను ఖతం చేయాలని ప్లాన్ వేశారు. అందుకు రూ.20 లక్షలు సుపారీ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చున్నారు. రూ.5 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. పక్కా ప్లాన్ ప్రకారం ఆ వ్యక్తిని కిడ్నాప్ చేశారు. చంపాల్సింది అతన్నే అని కన్ఫామ్ చేసుకున్నారు. కానీ చివర్లో ట్విస్ట్ ఇచ్చారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం సువర్ణపూరం గ్రామంలో తొట దర్మ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. అతని భార్యతో అదే గ్రామానికి చెందిన కొండూరి రామంజనేయులు అలియాస్ రాము అనే వ్యక్తికి మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో భర్త దర్మకు ఈ అక్రమ సంబంధం విషయం తెలిసింది. కొంత కాలంగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో ఎలాగైనా ప్రియురాలి భర్తను అడ్డు తొలగించాలని రాము నిర్ణయించుకున్...