భారతదేశం, ఫిబ్రవరి 29 -- Khammam Congress: ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ నాయకుడిపై హత్యాయత్నం కలకలం రేపింది. కొణిజర్ల మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, కొణిజర్ల Konijarla గ్రామ మాజీ సర్పంచ్ Ex Sarpanch సూరంపల్లి రామారావు పై ఇద్దరు దుండగులు కత్తితో దాడి చేసి హత్యాయత్నం చేశారు.

మండల కేంద్రంలోని ఆయన నివాసానికి ఎదురుగా ఉన్న ఇంట్లో బుధవారం రాత్రి వివాహం జరిగింది. కాగా ఆ వివాహానికి హాజరైన రామారావు రాత్రి 12 గంటల సమయం దాటే వరకు అక్కడే గడిపారు.

అనంతరం తన ఇంటి ఆవరణలోకి చేరుకుని ఇంట్లోకి వెళుతుండగా లోపలికి చొరబడిన ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా ఆయనపై కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో ఆయన వారిని ప్రతిఘటించే ప్రయత్నం చేసినప్పటికీ కడుపులో కత్తి పోట్లు పడ్డాయి.

ఆయన తల్లి గమనించి కేకలు వేయడంతో దుండగులు గోడ దూకి పారిపోయారు. తీవ్ర రక్తశ్రావం అవ...