భారతదేశం, ఫిబ్రవరి 17 -- Kesineni Nani: విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారంటూ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు గుడ్‌బై చెప్పిన నాని మళ్లీ అదృష్టం పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ టిక్కెట్ దక్కక పోవడంతో వైసీపీలో చేరిన కేశినేని నాని తమ్ముడి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు. గత ఏడాది జూన్‌ 10న ఇక రాజకీయాల్లోకి రానని చెప్పారు.

కొంత కాలంగా కేశినేని నాని బీజేపీ శ్రేణులతో చర్చలు జరుపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ వంటి వారితో ఉన్న సంబంధాల నేపథ్యంలో రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని ప్రచారం మొదలైంది. కేశినేని నానితో పాటు ఆ‍యన కుమార్తె కూడా విజయవాడలో కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. ఈ నేపథ్య...