భారతదేశం, ఫిబ్రవరి 12 -- Kerala ragging: కేరళలోని కొట్టాయంలోని ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థుల దుస్తులను బలవంతంగా విప్పించి, వారి మర్మాంగాలకు డంబెల్స్ ను వేలాడదీసి చిత్రహింసలకు గురిచేశారు. ర్యాగింగ్ కు పాల్పడిన ఐదుగురు థర్డ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులను అరెస్టు చేశామని, ముగ్గురు ప్రథమ సంవత్సరం విద్యార్థులు ఫిర్యాదు చేయడంతో వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

యాంటీ ర్యాగింగ్ యాక్ట్ కింద నమోదైన ఫిర్యాదు ప్రకారం 2024 నవంబర్లో ర్యాగింగ్ ప్రారంభమైందని, అప్పటి నుంచి ర్యాగింగ్ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. బాధిత విద్యార్థులు ఇచ్చిన పిర్యాదు ప్రకారం.. సీనియర్లు ర్యాగింగ్ పేరుతో జూనియర్ విద్యార్థులపై హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. వారు జూనియర్ విద్యార్థులను న...