భారతదేశం, మార్చి 28 -- Arvind Kejriwal custody: ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో గురువారం అరుదైన సంఘటన జరిగింది. తన తరఫు న్యాయవాదులు కోర్టు హాల్లో ఉన్నప్పటికీ.. తన వాదనను అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) తనే స్వయంగా వినిపించారు. ఈ పద్ధతిని ఈడీ న్యాయవాదులు వ్యతిరేకించారు.

ఆరు రోజుల ఈడీ కస్టడీ ముగియడంతో అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ (ED) మరోసారి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చింది. కేజ్రీవాల్ విచారణకు ఉద్దేశపూర్వకంగా సహకరించడం లేదని, ఆయన తరఫు న్యాయవాదులు ఆదాయపు పన్ను వివరాలను పంచుకోలేదని ఈడీ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ (Arvind Kejriwal) కస్టడీని మరో ఏడు రోజుల పాటు పొడిగించాలని ఈడీ కోర్టును కోరింది. ఢిల్లీ మద్యం కేసులో ఇతర నిందితులను కేజ్రీవాల్ ను కలిపి విచారించాల్సి ఉందని కోర్టుకు వివరించింది.

కెజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ (ED) ...