భారతదేశం, మార్చి 24 -- బిజీగా ఉండడం వల్లనో, పాత్ర సూటవకపోవటం వల్లనో లేకపోతే ఇతర కారణాలతో కొందరు సినీ తారలు కొన్ని చిత్రాలను తిరస్కరిస్తుంటారు. ఒకవేళ వాళ్లు వద్దనుకున్న సినిమా భారీ బ్లాక్‍బస్టర్ అయిందంటే దాని గురించి చర్చ జరుగుతుంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్ విషయంలో ఇది జరుగుతోంది. భారీ బ్లాక్‍బస్టర్ అయిన ఛావా చిత్రంలో ముందు కీర్తి సురేశ్‍కు అవకాశం వచ్చిందట. ఆమె వేరే మూవీ కోసం ఈ ఆఫర్ తిరస్కరించారనే రూమర్లు వస్తున్నాయి.

ఛావా సినిమాలో రష్మిక మందన్నా పోషించిన యేసుభాయి పాత్ర కోసం ముందుగా కీర్తి సురేశ్‍నే మేకర్స్ సంప్రదించారట. కానీ బేబీజాన్ చిత్రంలో బిజీగా ఉన్న కీర్తి.. ఈ ఆఫర్ వద్దన్నారనే రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. బేబీజాన్ కోసం ఛావాకు కీర్తి నో చెప్పారనే పుకార్లు సోషల్ మీడియాలో వస్తున్నాయి.

బేబీజాన్ చిత్రంతోనే బాలీవుడ్‍...