Hyderabad, ఫిబ్రవరి 25 -- Kedar Selagamshetty: టాలీవుడ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగమ్‌శెట్టి కన్నుమూశాడు. గతేడాది ఆనంద్ దేవరకొండతో గం గం గణేశా మూవీతో అతడు పాపులర్ అయ్యాడు. అతడు టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్, విజయ్ దేవరకొండలకు సన్నిహితుడు. కేదార్ మంగళవారం (ఫిబ్రవరి 25) దుబాయ్ లో తుదిశ్వాస విడిచాడు.

నిర్మాత కేదార్ సెలగమ్‌శెట్టి కన్నుమూయడంపై టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. అతని మరణానికి కారణమేంటో తెలియలేదు. అయితే కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు మాత్రం వార్తలు వస్తున్నాయి. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, నిఖిల్ సిద్ధార్థలాంటి హీరోలకు సన్నిహితుడు కావడంతోపాటు గతేడాది గం గం గణేశా మూవీ ద్వారా కూడా పాపులర్ అయ్యాడు.

హైదరాబాద్ లోని జూబ్లీ 800 పబ్ కు ఓనర్ కూడా. అల్లు అర్జున్ తో కలిసి అతడు ఈ బిజినెస్ లోకి దిగినట్లు తెలిసింది. జూబ...