భారతదేశం, ఫిబ్రవరి 1 -- తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. దాదాపు ఏడాది కాలంగా మౌనంగా ఉన్న కేసీఆర్.. తాజాగా కీలక కామెంట్స్ చేశారు. శుక్రవారం గజ్వేల్ సమీపంలోని తన ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పార్టీ కార్యకర్తలు, నాయకులతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ గవర్నమెంట్‌పై కన్నెర్ర చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే పెద్ద ఎత్తున అసంతృప్తిని కూడగట్టుకుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా.. సోషల్ మీడియా పోల్‌ను ఆయన గుర్తుచేశారు. నెటిజన్లు ఏ ప్రభుత్వాన్ని ఎంచుకుంటారని అడిగిన ప్రశ్నకు.. కొన్ని వేల మంది సమాధానం ఇచ్చారని.. వారు 'ప్రజా పలాన పాలన' కంటే 'ఫామ్‌హౌస్ పాలన'ను ఎంచుకున్నారని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

ప్రతి రంగంలోనూ ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నాయని గులాబీ పార్టీ చీఫ్ విమర్శించారు. ప్రభు...