భారతదేశం, ఫిబ్రవరి 14 -- తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటిపోయింది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు ఏ క్షణమైనా నగారా మోగే అవకాశం ఉంది. ఇంకోవైపు కారు పుట్టి 25 ఏండ్లు కావొస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. దీంతో కేసీఆర్ భారీ ప్లాన్‌తో రీ ఎంట్రీ ఇస్తున్నట్టు పొలిటికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఈనెల 19వ తేదీన బీఆర్ఎస్ కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించాలని.. కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను ఆదేశించారు. అధినేత ఆదేశాల మేరకు.. ఈనెల 19వ తేదీన మధ్యాహ్నం ఒంటి గంట నుండి హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్‌లో పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది...