భారతదేశం, మార్చి 23 -- బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఏది మాట్లాడినా.. అది సంచలనమే. తాజాగా ఆయన ఏపీ సీఎం చంద్రబాబు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ సంపద మీద గుంట నక్కల్లాగా అందరూ కన్నేశారని వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. చంద్రబాబు విజయం, ఎన్డీయే కూటమి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

'తెలంగాణలో ఇప్పుడు ఉన్న పాలకులు సరిగా పని చేస్తలేరట. మంచిగా పాలన చేయాలంటే చంద్రబాబు రావాలట. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని కొన్ని పత్రికలు రాస్తున్నా యి. కూటమి కట్టకుండా చంద్రబాబు ఏపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేవాడా. అలాంటి వారిని ఏవో అద్భుత శక్తులు ఉన్నవారిగా మనకు చూపే కుట్రలు జరుగుతున్నాయి' అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

'తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసేందుకు కొందరు రెడీగా ఉంటారు. వారిపట్ల తెలంగాణ...