భారతదేశం, జనవరి 31 -- ఇన్ని రోజులుగా మౌనంగా ఉన్నా.. గంభీరంగా చూస్తున్నా.. కొడితే మామూలుగా ఉండదు.. అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇక లాభం లేదు.. ప్రత్యక్షపోరాటం చేయాల్సిందే అని స్పష్టం చేశారు. ఎర్రవల్లిలోని తన నివాసంలో కేసీఆర్ జహీరాబాద్‌ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

'కాంగ్రెస్ వాడు పోలింగ్ పెడితే 70 శాతం మనకే అనుకూలంగా ఓట్లు వేశారు. 30 శాతం వాడికి వేశారు. ఇక లాభం లేదు, ప్రత్యక్షపోరాటం చేయాల్సిందే. నమ్మి ఓట్లు వేస్తే గుణపాఠం చెప్పారు. తులం బంగారం అన్నాడు, వడ్డానం అన్నాడు.. నమ్మి ఓట్లు వేసి బావిలో పడ్డారు. రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయి. కరోనా టైంలో కూడా నేను రైతుబంధు ఆపలేదు. రైతు బీమాతో ఎంతో మంది రైతులకు మేలు ...