భారతదేశం, ఫిబ్రవరి 17 -- కేసీఆర్ కడుపున పుట్టడం తన పూర్వజన్మ సుకృతం అని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ జాతికి కేసీఆర్ ఒక హీరో అని అభివర్ణించారు. ఉద్యమం కోసం నడుం బిగించిన నాడు మీడియా లేదు.. మద్దతు లేదు.. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఉద్యమాన్ని నడిపారని కొనియాడారు. కేసీఆర్ పుట్టినరోజు వేడుకల్లో కేటీఆర్ ఈ కామెంట్స్ చేశారు.

'చావు నోట్లో తలపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ నా ఒక్కడికే కాదు.. తెలంగాణ మొత్తానికి హీరో. చావు నోట్లో తల పెట్టిన కారణజన్ముడు కేసీఆర్. కేసీఆర్ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆయన్ను సీఎం చేసేందుకు ఒక లక్ష్యంతో ముందుకెళ్దాం. తెలంగాణ పసిగుడ్డును మళ్లీ కేసీఆర్ చేతిలోపెడదాం' అని కేటీఆర్ పిలుపునిచ్చారు.

'కేసీఆర్‌ అంటే నాలుగు కోట్ల ప్ర...