భారతదేశం, ఏప్రిల్ 5 -- KCR : తెలంగాణ బాగోగులపై బీఆర్‌ఎస్‌కు ఉన్న ఆవేదన మరో ఏ పార్టీకి లేదని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ అన్నారు. శనివారం ఎర్రవెల్లిలో పార్టీ నేతలో సమావేశమైన కేసీఆర్... బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ, రజతోత్సవ మహాసభపై చర్చించారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం నేతలు పాల్గొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం సఫాయి కార్మికులకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల ఉందని, గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని కేసీఆర్ ఆరోపించారు. గ్రామాల్లో మెయింటెనెన్స్‌ లేక ట్రాక్టర్లు మూలనపడ్డాయని బీఆర్ఎస్ నేతలు కేసీఆర్ తో చెప్పారు. అధికారం కోసం అమలుకాని హామీలు ఇచ్చి బూటకపు గ్యారంటీలతో ప్రజలను నమ్మించిన కాంగ్రెస్‌ పార్టీపై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రాష్ట్రంలో పరిస్థితుల...